Sunday, January 19, 2025

నల్లగొండను కెసిఆర్ సర్వనాశనం చేసిండు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని పదవులను గడ్డిపోచల్లా వదలుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం కృష్ణా జలాల వివాదానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాను కెసిఆర్ సర్వనాశనం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ హయాంలో జీవో తెచ్చారని.. అప్పుడు మేం వైఎస్ కు వ్యతిరేకంగా కొట్లాడామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ పాలనలో నల్గొండకు నీళ్లు ఇవ్వలేదన్నారు. సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని చెప్పారు. అవసరం లేకున్నా కమిషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం కట్టారని ఆగ్రహం వ్యక్తం మంత్రి కోమటిరెడ్డి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News