Sunday, December 22, 2024

నల్లగొండ జిల్లాను ఆగం పట్టించిందే కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : నల్గొండ జిల్లాకు కెసిఆర్ చేసింది ఏమీ లేదని, జిల్లాను ఆగం పట్టించిందే ఆయన అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ముక్కు నేలకు రాసి రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో నల్లగొండ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బిసిని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారని దుయ్యబట్టారు.

కెసిఆర్ మాట తప్పడంపై నల్లగొండలో బిఆర్‌ఎస్ సభ రోజు వినూత్న రీతిలో నిరసన చే యనున్నట్లు వెల్లడించారు. కెసిఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్ ఈడి స్క్రీన్‌ను పోలీసుల పర్మిషన్ తో పెట్టుకోవాలని సూచించారు. తాము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైన బడ్జెట్ అన్నారు. కృష్ణా నీటి పంపకాల విషయంలో కెఆర్‌ఎంబి ఫైళ్లపై సంతకం పెట్టిందే కెసిఆర్, హరీష్ రావు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News