Friday, December 20, 2024

రేవంత్ రెడ్డికి భయపడి కెసిఆర్ అసెంబ్లీకి రావడం లేదు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని తాము చెప్పలేదని తెలిపారు. కవిత జైలుకు వెళ్లిందని.. బిఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు అసహ్యంగా ఉన్నాయని ఫైరయ్యారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు, 30 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టినందుకా?.. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిట్టేది అని మంత్రి నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.  బీఆర్ఎస్ ఎల్బీ బాధ్యత కేటీఆర్ కు ఇస్తే.. హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని అన్నారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్లో  కేసీఆర్,  కేటీఆర్, హరీశ్ రావు తప్పా ఒక్కరూ ఉండరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News