Sunday, January 12, 2025

సోనియాగాంధీ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోనియాగాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని శాసన సభలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కెసిఆర్ స్వయంగా ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిసెంబర్ 9వ తేదీ.. తెలంగాణ ప్రకటించిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల కోరిక తీరిన రోజు అని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏమీ రాలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం సభలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై చర్చ జరుగుతోంది. కాగా, ఇవాళ సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News