Thursday, January 23, 2025

బిఆర్ఎస్ ప్రతిపక్షం కాదు.. ఫ్రస్ట్రేషన్ పక్షం: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ప్రతిపక్షం కాదు.. ఫ్రస్ట్రేషన్ పక్షం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. దోచుకున్న డబ్బుతో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సభ పెట్టారని ఆరోపించారు. నల్గొండ ప్రజలు మిమ్మల్సీ చీదరించారని.. అందుకే సభకు రాలేదని..దాంతో బీఆర్ఎస్ వాళ్లు ఇతర జిల్లాల నుంచి ప్రజలను సభకు తీసుకుపోయారని విమర్శించారు.

తెలంగాణకు ఒక దళిత వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని..తన తల తెగిపడినా మాట తప్పన కెసిఆర్ చెప్పారని.. దళితుడిని సీఎంను చేయకపోగా.. ప్రతిపక్ష నాయకుడిగా భట్టి విక్రమార్క ఉంటే.. కెసిఆర్ ఓర్వలేకపోయారని ఫైర్ అయ్యారు. అధికారం పోయిందని ఏం చేయాలో తెలియక వీళ్లకు ప్రాబ్లమ్ వచ్చిందని.. బిఆర్ఎస్ వాళ్లను దేవుడు కూడా కాపాడలేడని చురకలు అంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News