Sunday, December 22, 2024

అమెరికా పర్యటనకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రవాస భారతీయ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యం అవుతున్న ఎస్‌ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News