Wednesday, December 25, 2024

అసెంబ్లీలో హరీష్ రావు వర్సెస్ కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో 2024 -25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ఈ సందర్భంగా హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటలయుద్ధం సాగింది. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో హాఫ్ నాలెడ్జ్ అంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీశ్ రావు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని, కానీ బీఆర్‌ఎస్ అంటేనే అబద్ధాలకు పుట్టిల్లు అన్నారు. బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామన్న కేసీఆర్ సభకే రాలేదన్నారు. 2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తామని చెప్పి అబద్ధాలను ఆనాటి టీఆర్‌ఎస్ ప్రస్తుత బీఆర్‌ఎస్ మొదలు పెట్టిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని చెబితే తాను ఓ సబ్ స్టేషన్ కు వెళ్లి పరిశీలించానని అక్కడే పని చేసే ఆపరేటర్ 9 ఏళ్ల నుంచి ఏనాడు 14 గంటల విద్యుత్ సప్లై కాలేదని చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు.

మోసాలు, అబద్ధాలు బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచే పుట్టాయని మంత్రి సెటైర్లు వేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు ఆనాడు కొని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ బడ్జ్పె చీల్చిచెండాడుతాడని పత్రికల్లో వార్తలు వస్తే తాను తొమ్మిది గంటలకు వచ్చి కూర్చున్నానని అయితే కేసీఆర్ కు వచ్చే మొఖం లేక హరీష్ రావును పంపారన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. కోమటిరెడ్డికి ‘హాఫ్ నాలెడ్జ్’ ఉందనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ కల్పించుకుని హాప్ నాలెడ్జ్ పదం విరమించుకోవాలని హరీష్ రావును కోరి రికార్డుల నుంచి తొలగించారు. దీనికి కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావుకు ఆకారం పెరిగిందని అసలు నాలెడ్జ్ లేదని కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గతంలో డమ్మీ మినిస్టర్ అని, డమ్మీ అల్లుడు అని కోమటిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సభలో సమాధానం చెప్పలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు.

ఆయన స్థానంలో హరీశ్ రావును పంపించారన్నారు. హరీశ్ రావు ఓ డమ్మీ నాయకుడు అన్నారు. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఉందన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చామని హరీశ్ రావు చెప్పారని, కానీ అందులో నిజం లేదన్నారు. హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్య మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు రికారడ్స్ నుంచి తొలగించుకోండని హరీశ్ రావు సభాపతికి సూచించారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని కోమటిరెడ్డి గతంలో అనలేదా? అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, బస్సులను పెంచాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News