Monday, January 13, 2025

మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి భక్తులు సమర్పించే  కోడెలు అక్రమంగా విక్రయించినట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ ఇచ్చారు. రాజన్న కోడెలు అక్రమ రవాణా జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వంపై కుట్రపూరితంగా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు ఇవన్నీ అన్నారు. కోడెల పంపిణీకి ఆరు నెలల క్రితమే ఓ కమిటీని రూపొందించి మార్గదర్శకాలను రూపొందించామన్నారు.

దానికి సంబంధించిన జివో విషయాన్ని కూడా మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ఆ మార్గదర్శకాల ప్రకారం పట్టదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రం ఉంటేనే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ధ్రువీకరణ పత్రాలున్న రైతుకు రెండు కోడెల చొప్పున మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు స్సష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరగడంతో నిర్వహణ భారంగా మారి అనేక కోడెలు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలల్లో సిసి ఫోర్లింగ్, సరిపడ షెడ్లు,తాగునీటి వసతి ఏర్పాట్లు చేసినట్లు సురేఖ వివరించారు. దేవ స్థానంలో ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ ఉంటుందని, అటువంటి ట్యాగ్ లున్న కోడెలు ఎక్కడా పట్టబడలేదని వివరించారు. సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికి తెచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News