Saturday, December 21, 2024

పిసిబిని అభినందించిన మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

మేడారం జాతరలో కాలుష్య నివారణకు పిసిబి చర్యలు
అభినందించిన మంత్రి కొండా సురేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది జాతరకు దాదాపు కోటి మంది యాత్రికులు వస్తారని అంచనా. ఈ క్రమంలో జాతరలో ప్రజల సమూహాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలు ప్రధానంగా కారణమవుతాయి. ముఖ్యంగా నీటి కాలుష్యం, వాయు కాలుష్యం , శబ్ద కాలుష్యంతో పాటు పారిశుధ్యం , ప్రజారోగ్య సమస్యలు ప్రధానమైనవి. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతంలోకి భక్తులు ప్రవేశించే ముందు మేడారం గ్రామ సమీపంలో జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేయడం ఒకటైతే ఆ వాగు ప్రవాహంలో లక్షలాది మంది భక్తులు స్నానాలు చేయడం మరోటి. దీంతో మేడారం లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాలంటీర్ల సహాయంతో ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ నియంత్రణపై ప్రచారం చేస్తూ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. తద్వారా పర్యావరణ పరమైన అవగాహన కల్పించడంతో పాటు జాతర స్థలాన్ని ప్లాస్టిక్స్ రహిత, ఇతర వ్యర్థాలు లేకుండా ఉంచేలా చూస్తోంది.

నీటి కాలుష్యం, గాలి కాలుష్యం లేకుండా స్నాన ఘాట్‌ల వద్ద సబ్బులతో స్నానం చేయవద్దని, డిటర్జెంట్‌లతో బట్టలు ఉతకడం వల్ల కాలుష్యం పెరుగుతుందని వెల్లడిస్తోంది. బట్టలు ఉతికి వాగు నీటి నాణ్యతను దిగజార్చవద్దని చెబుతున్నారు. అన్నింటికీ మించి జాతరలో ప్రజారోగ్యం , పర్యావరణాన్ని పరిరక్షించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి పర్యావరణ అనుకూలమైన వాటినే వినియోగించుకోవడం ద్వారా జాతరను పరిశుభ్రంగా ఉందచుకుందామంటోంది. ఈ సందర్భంగా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ మేడారం జాతర స్థలంలో, చుట్టుపక్కల ప్లాస్టిక్ కవర్లు, ఇతర వాడి పారేసే ప్లాస్టిక్‌లను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమ్మవారి పూజల కోసం ‘గద్దెల’ వద్దకు వచ్చే భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ప్లాస్టిక్ రహితంగా శుభ్రంగా ఉంచాలన్నారు. ప్లాస్టిక్ తదితర వస్తువులను వాడడం వల్ల అది పర్యావరణ పరంగా ఆందోళనకు కారణం అవుతోందన్నారు. మేడారం జాతర స్థలాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు ప్లాస్టిక్, ఇతర చెత్తను అరికట్టాలనికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News