Wednesday, January 22, 2025

రాహుల్‌గాంధీ కులంతో బిజెపికి ఏం పని?: మంత్రి సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌:  మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కులగణన చేపడుతున్న నేపథ్యంలో బీజేపీఎల్పీ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని అన్నారు. దీనికి మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌గాంధీ కులంతో బీజేపీకి ఏం పని? అని ప్రశ్నించారు. రాహుల్‌ కులం తెలియాలంటే దేశంలో కులగణన చేయండని సెటైర్ వేశారు. కులపత్రంతో రాహుల్‌గాంధీ ఇంటికి బీజేపీ వెళ్తే చెబుతారని అన్నారు.

గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల విజ్ఞప్తులను మంత్రి కొండా సురేఖ పరిశీలించి పరిష్కరించేందుకు ప్రయత్నించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఫోన్‌ చెప్పారు. రాష్ట్రంలో కులవివక్షను పోగొట్టడానికే కులగణన చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కులగణనతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News