Monday, December 23, 2024

కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారు: మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పిన మాటలను ఖండించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారని ఆమె ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిరుపేదలకు ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు సైతం వాళ్ల కార్యకర్తలకే ఇచ్చుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్, కెసిఆర్ బయట తిట్టుకుంటారని. లోపల మాత్రం కలిసే ఉంటారని ఆమె ఆరోపించారు. కృష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని దూరం పెట్టిందే కెసిఆర్ అని ఆమె పేర్కొన్నారు. వరంగల్ జైలు కూలగొట్టి ఏం చేశారో చెప్పాలని, పాత సెక్రటేరియట్ కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News