Wednesday, February 12, 2025

కెటిఆర్ తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలి:మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

కులగణన రీ సర్వే చేయాలంటున్న కెటిఆర్, తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కొండా హితవు పలికారు. కానీ, రీ సర్వే చేయాలంటే ముందు కెటిఆర్ దరఖాస్తు చేసుకోవాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కెటిఆర్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ మంగళవారం విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా మాట్లాడుతూ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అసంతృప్తి అనేది తనకు తెలియదని, ఈ విషయంలో తాను ఎవరినీ ప్రోత్సహించడం లేదని మంత్రి పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతున్నందు వల్ల ఈఓలుగా రెవెన్యూ ఉద్యోగులను తీసుకుంటున్నట్లు మంత్రి కొండా తెలిపారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులను తీసుకోవడం కొత్తేమీ కాదని ఆమె పేర్కొన్నారు.

గత పదేళ్లలో దేవాదాయ శాఖ భూములు కబ్జా
రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంబాభిషేకాలు చేయాలో అధికారులను జాబితా తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుందని మంత్రి గుర్తు చేశారు. గత పదేళ్లలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని మంత్రి తెలిపారు. న్యాయపరంగా ఇబ్బంది లేని దేవాదాయ శాఖ భూములను మొదటి దశలోనే సర్వే చేయాలని అదేశించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. ఈ సర్వేలు చేయడానికి వెళ్లిన సర్వేయర్ల దాడులు జరిగినట్టు ఎక్కడా ఫిర్యాదులు అందలేదని మంత్రి పేర్కొన్నారు.

దేవర యాంజాల్‌లో దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేశారని గతంలో బిజెపి నేత ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ త్వరలోనే దానిపై విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. కులగణనతో పాటు బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని బిఆర్‌ఎస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్ల విలువ ఇప్పుడే అర్థం కాదని వాటిని అమలు చేశాక దానివల్ల ఎంత లాభం ఉంటుందో అందరికీ అర్థమవుతుందని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బిసిలకు న్యాయం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News