Sunday, December 22, 2024

ప్రజావాణికి భారీ స్పందన.. వినతులు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజావాణి పేరిట విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. హైదరాబాదులోని జ్యోతిరావ్ ఫూలేభవన్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావ్ ఫూలే భవన్ వద్ద ప్రజలు బారులు తీరి ఉండడం కనిపించింది. మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది.

అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని , వారి అర్జీలను తీసుకున్నారు. ప్రతి అర్జికి ఒక నంబర్‌ను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సందేశo పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణి నిర్వహణను జలమండలి ఎండి దాన కిషోర్, జిహెచ్‌ఎంసి కమిష నర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. కార్యక్రమంలో సీనియర్ ఐఎఎస్ అధికారి ముషారఫ్ అలీ, ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News