Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వాణిజ్య ఒప్పందాల మాటున అంతా అవినీతే:కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వాణిజ్య ఒప్పందాల మాటున అంతా అవినీతి, అక్రమాలు జరిగాయని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకు నిదర్శనం ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీయేనని అన్నారు. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగుతోందని అన్నారు. కానీ బిఆర్‌ఎస్ నేతలు రేవంత్ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. గతంలో కేటీఆర్ షాడో సీఎం గా పనిచేయలేదా, పనికి రానీ మాటలు బంద్ చేయాలని గట్టిగా మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కేటీఆర్ వైఖరి ఉందని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న మంత్రి సురేఖ నివాసం వద్ద ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనపై బిఆర్‌ఎస్ నుంచి వస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ గతంలో అమెరికా పర్యటన ఎందుకు చేశారని నిలదీశారు. బిఆర్‌ఎస్ అధికారంలో వున్నప్పుడు అడ్డగోలుగా దోచుకుందని అన్నారు. ఇప్పుడు బట్టకాల్చి మీదేసే పని చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసుకున ఎంఓయూలు అన్నీ బోగస్ కంపెనీలేనని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, దళిత బంధు, మిషన్ భగీరథ అన్ని పథకాలు కుంభకోణాలేనని ఆరోపిస్తూ లక్షల కోట్లు దోచుకున్నారని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకొని ప్రతిపక్షంలో కూర్చున్నారని మంత్రి సురేఖ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుజువులతో మాట్లాడితే మంచిదని, అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ పై చెడు ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ఏర్పాటు చేశారని అన్నారు. ఆ సోషల్ మీడియాను గాంధీ భవన్ టీమ్ ఎదుర్కుంటుందని ధీటుగా జవాబిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News