Sunday, December 22, 2024

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొప్పుల దంపతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో కొప్పుల ఈశ్వర్ దంపతులకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అమ్మవారి దీవెనలు మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News