Thursday, January 23, 2025

నిరుపేద విద్యార్థిని పై చదువులకు సాయం చేసిన మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుపేద విద్యార్థిని పై చదువుల కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహాయం అందించారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐకాన్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్) నిర్వహించిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో గోదావరిఖని విద్యాసాగర్‌కు చెందిన సలిగంటి కావేరి అత్యంత ప్రతిభ కనబరిచింది. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటి విడుదల చేసిన ఫలితాల్లో 269వ జాతీయ ర్యాంకు పొంది యూనివర్సిటీలో బిఎస్‌సి అగ్రికల్చర్ సీటు సాధించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించడం జరిగింది. మంత్రి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని పై చదువుల కోసం 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News