Wednesday, January 22, 2025

మెట్రో రైలులో ప్రయాణించిన కొప్పుల

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar Traveling on Metro train

హైదరాబాద్ : అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెట్రో రైలులో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. గురువారం పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తాతో కలిసి హైదరాబాద్ మెట్రోరైలులో ప్రయాణించారు. సరూర్‌నగర్‌లోని విఎం హోం గురుకుల పాఠశాలలో ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించేందుకు గాను మంత్రి మెట్రోలో అసెంబ్లీ స్టేషన్ నుంచి విక్టోరియా మోమోరియల్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి నుంచి కారులో పాఠశాలకు చేరుకున్నారు. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలిచిన మెట్రోలో ప్రయాణించడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News