Wednesday, January 22, 2025

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుపతి లో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తర్వాత శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచణం చేయగా ఆలయ ఈవో వరసిద్ధి వినాయక స్వామి శేష వస్త్రంతో మంత్రి గారిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కాణిపాక గణనాథుని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News