Wednesday, January 22, 2025

పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar visiting Patel statue

హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా 597 అడుగుల ఎత్తులో పటేల్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. నర్మదా నది లోయలోని కేవాడియా వద్ద సాధూబెట్ అనే చిన్న దీవిలో 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరాన దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించనున్న విషయం విధితమే.

అంబేడ్కర్ 125 అడుగుల (పీఠంతో కలిపి 175 అడుగులు) విగ్రహం నిర్మాణం ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి.సంబంధిత శాఖ అధికారులతో కలిసి మంగళ,బుధవారాలు ఢిల్లీ పరిసరాలలో ఉన్న పలు విగ్రహాల తయారీ స్టూడియోలను మంత్రి సందర్శించారు. గురువారం కేవాడియా చేరుకుని సర్దార్ పటేల్ విగ్రహాన్ని మంత్రి సందర్శించారు. పటేల్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, ప్రదర్శనశాల,లేజర్ షోలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన, అందుకు సంబంధించిన విశేషాలను అక్కడి అధికారులు మంత్రి కొప్పులకు వివరించారు. విగ్రహ నిర్వహణ,అక్కడి పరిసరాలు, పరిశుభ్రత, సుందరీకరణను మంత్రి నిశితంగా పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News