Sunday, December 22, 2024

తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి కొప్పుల..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొప్పుల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి కొప్పులకు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం‌ ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామి వారిని వేడుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

Minister Koppula Eshwar visits Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News