Sunday, December 22, 2024

విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తాం: మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar wished Dussehra

గోదావరిఖని శ్రీజయదుర్గ ఆలయంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతుల ప్రత్యేక పూజలు
రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు గోదావరిఖనిలోని శ్రీజయదుర్గ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. తెలంగాణ స్పూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని ఆకాంక్షించారు. విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం మరెన్నో అబ్బురపరిచే అద్భుత విజయాలను సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ జరుపుకుంటున్నామని చెప్పారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. దుర్గామాత ఆశీస్సులతో అన్నింటా విజయాలు సిద్ధిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News