Sunday, November 3, 2024

మహిళలు చదువుకుంటే దేశం బాగుపడుతుంది

- Advertisement -
- Advertisement -

Minister Koppula launch Children Monthly Magazine Thumbi

అందరికి ఉచిత విద్య అందించడానికే గురుకులాలు
పిల్లల మాస పత్రిక “తుంబి” ఆవిష్కరణ సభలో మంత్రి కొప్పుల

హైదరాబాద్ : మానవ జీవితంలో విద్యను మించింది మరొకటి లేదని, విద్యతోనే వికాసం ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం, దేశం మరింత అభివృద్ధి చెందుతాయన్నారు నగర శివార్లలోని నార్సింగి ఎస్‌సి బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఆయన “తుంబి” అనే పిల్లల మాస పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని వెల్లడించారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశ పెట్టడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని, అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు.

గురుకులాలలో చదువుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలబాలికలు ఆంగ్లములో అనర్గళంగా మాట్లాడుతుండడం, అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుండడం సంతోషం కల్గిస్తుందన్నారు. మహానీయుల జీవిత చరిత్రలు, విజయగాథలు, నీతి కథలు, పెయింటింగ్స్, కార్టూన్స్ తో కూడిన ఈ “తుంబి” మాస పత్రిక వంటి మ్యాగజైన్ ను మన గురుకుల విద్యార్థులు కూడా తీసుకువస్తే బాగుంటుందన్నారు. మనిషి ప్రకృతితో క లిసి ముందుకు సాగాలని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యతను ఈ తుంబి గుర్తు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సి గురుకుల విద్యా సంస్థల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్లు దేశ విదేశాలలో గొప్పగా స్థిరపడుతున్నారని, నలుగురు అమ్మాయిలు ఉన్నత విద్యనభ్యసించేందుకు నిన్ననే అమెరికా వెళ్లారని తెలిపారు.

సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తుంబి పత్రిక పుస్తక పఠనాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుందన్నారు. బాలబాలికలలో నిగూఢమై ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు తమిళనాడుకు చెందిన శివరాజు (శివన్న), 20 ఏండ్లుగా తుంబి (తూనీగ) మాస పత్రికను తెస్తుండడాన్ని మంత్రి కొప్పుల, సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్ డైరెక్టర్ హరికృష్ణ, ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ సందర్బంగా మంత్రి పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. భోజనం చేశారు. వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తరగతి గదులను పరిశీలించారు. శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ గురించి పలు సూచనలు చేశారు. సలహాలిచ్చారు. కార్యక్రమానికి ముందు బాలికలు ప్రదర్శించిన “రేలా రేలా ఇది తెలంగాణ నేల ” అనే నృత్య రూపకం అందరిని ఆలరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News