మనతెలంగాణ/హైదరాబాద్ : బుద్ధుడి బోధనలు అనుసరణీయమని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి కొప్పులకు సమతా సేవాదళ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాకినాడకు చెందిన ప్రముఖ బౌద్ధ భిక్షువు బంతే ధామ్నా ధజథేరో ఆధ్వర్యంలో పోస్టర్, నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ గౌతమ బుద్ధుడి బోధనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయన్నారు. ఆయన బోధనలు నాటికి, నేటికి ఆచరణీయమన్నారు. బుద్ధుడి బోధనలతో భారత ఉపఖండంతో పాటు పలు విదేశాల ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్‌రావు, బౌద్ధ భిక్షువు ధజథేరో, సమతా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.