Monday, December 23, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హన్మకొండ పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం హన్మకొండ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీభద్రకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ని ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజ.లు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి కొప్పుల వెంట రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె. వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News