మహబూబ్‌నగర్: ఒకప్పుడు పాలమూరు అంటే… మైగ్రేషన్.. ఇప్పుడు పాలమూరు అంటే .. ఇరిగేషన్ అని మంత్రి కెటిఆర్ అన్నారు. పాలమూరు పచ్చబడుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని కెటిఆర్ ఫైర్ అయ్యారు. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే… పాలమూరులోనా అని పాటలు ఉండేవి… పల్లెపల్లెనా పసిడి పంటలు పండే.. అని ఇప్పుడు పాడుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.
ఒకప్పుడు పాలమూరు బిడ్డలు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేవాళ్లు.. ఇప్పుడు కర్నూలు, రాయచూరు నుంచి కూలీలు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.. బిఆర్ఎస్ అంటే… భారత రైతు సమితి అని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. కాంగ్రెస్ కు ఒక్కటి కాదు… 11 సార్లు ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. 55ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.