కాణీకి ఠికానా లేని కంపెనీ
చేతికి వేల కోట్ల పవన్ హంస్
ప్రభుత్వరంగ హెలికాప్టర్ సంస్థ పవన్ హంస్ విలువ 2017లోనే రూ.3700 కోట్లు
అందులోని 49శాతం ప్రభుత్వ వాటాను రూ.211 కోట్లకు అమ్మడం ఎలా సాధ్యం?
ఈ ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా?
ప్రధాని మోడీని నిలదీసిన మంత్రి కెటిఆర్
పవన్‌హంస్ లిమిటెడ్‌లో కేంద్రం వాటా 51శాతం ఒఎన్‌జిసికి
49శాతం 42 హెలికాప్టర్లను నడుపుతున్న సంస్థ వాటాను ఉపసం
హరించుకోవడానికి సిద్ధమైన కేంద్రం నిర్ణయించిన మేరకే
వాటా విక్రయానికి సిద్ధపడిని ఒఎన్‌జిసి వేలం దాఖలైన మూడు
బిడ్లు రూ.211.14కోట్లకు బిడ్ వేసిన స్టార్ 9 మొబిలిటికి ఆమోదం
తెలిపిన కేంద్ర ప్రభుత్వం అత్యంత తక్కువ ధరకే అమ్మకానికి
పెట్టిన ప్రభుత్వం : వైమానిక రంగ నిపుణులు, భారీ మోసం :కాంగ్రెస్
మన తెలంగాణ/హై-దరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మోడీ సర్కార్ ప్రైవేటీకరణ చేస్తోంది. తాజాగా లాభాల్లో ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ ‘పవన్ హన్స్’ను అమ్మడంపై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేట్ కంపెనీకి అ మ్మడమే ఓ ఘోరమైతే.. దానిని ఆరు నెలల క్రితం కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో పెట్టిన కంపెనీకి కట్టబెట్టడం చూస్తే అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని కెటిఆర్ అన్నారు. 2017లోనే పవన్ హన్స్ కంపెనీ విలువ రూ.3,700 కోట్లు ఉం డేదని, అలాంటి కంపెనీని లక్ష రూపాయల కంపెనీకి ఎలా అమ్మారని ట్విట్టర్ వేదికగా కెటిఆర్ ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితమే 3700 కోట్ల విలువైన కంపెనీలో 49 శాతం వాటా ను రూ.211 కోట్లకు అమ్మడం ఎలా సాధ్యమంటూ మండిపడ్డారు. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? అంటూ నిలదీశారు. ఆయన చేసిన ట్వీట్‌లో పవన్ హన్స్ సంస్థ అమ్మకానికి సంబంధించి నేషనల్ మీ డియాలో వచ్చిన కథనాలను కూడా షేర్ చే శారు. హెలికాప్టర్లను అద్దెకిచ్చే పవన్ హన్స్ కంపెనీలో భారత ప్రభుత్వం, ఓఎన్జీసి కలిసి 51:49 నిష్ఫత్తిలో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.
పవన్ హంస్ కథా కమామిషు
పవన్ హాన్స్ లిమిటెడ్‌లో కేంద్రానికి 51 శాతం వాటా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసి)కు49 శాతం వాటా ఉంది. ఈ సంస్థ 42 హెలికాప్టర్లను నడుపుతున్నది. కేంద్రం తన వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా, ఓన్జీసి కూడా కేంద్రం నిర్ణయించిన మేరకే తన వాటాను అమ్మేందుకు రెడీ అయ్యింది. పవన్ హాన్స్ కోసం మొత్తం మూడు బిడ్లు దాఖలయ్యాయి. స్టార్ 9 మొబిలిటీ రూ.211.14 కోట్లకు, మిగతా రెండు రూ.181.05 కోట్లు, రూ.153.15 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో స్టార్ 9 మొబిలిటి బిడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని కమిటీ పవన్ హాన్స్ అమ్మకానికి ఆమోదం తెలిపింది.
అత్యంత తక్కువ ధరకే ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది: వైమానిక రంగ నిపుణుల అభిప్రాయం
నోయిడా, ముంబై, ఢిల్లీలో పెద్ద యెత్తున స్థిరాస్తులు కలిగి,వెయ్యి మందికి పైగా ఉద్యోగులతో ఒక్కొక్కటి రూ.69 కోట్ల చొప్పున విలువ వుండే 49 హెలికాప్టర్లను నడపుతున్న పవన్‌హన్స్‌ను అత్యంత తక్కువ ధరకే ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విక్రయంలో గుడ్‌విల్‌ను కూడా పరిగణనలోనికి తీసుకోలేదని వాపోతున్నారు.
భారీ మోసం : కాంగ్రెస్
పవన్ హాన్స్ అమ్మకం భారీ మోసమని కాంగ్రెస్ ఆరోపించింది. రెండు బిడ్లు రిజర్వ్ ధర కంటే తక్కువకే నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాతో మాట్లాడుతూ.. స్టార్ 9 మొబిలిటీ కన్సార్టియంలో ఉన్న మహారాజా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఇంటర్నెట్‌లో ఎలాంటి వివరాలు లేవని తెలిపారు. ఆ పేరుతో ఫేస్ బుక్ ఉన్నా, అందులో బాబా రామ్‌దేవ్ ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు.