Monday, December 23, 2024

సివిల్స్ విజేతలకు కెటిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

Minister KTR Appreciates Telugu CIivils Rankers

మన తెలంగాణ/హైద్రాబాద్: యూపీఎస్సీ సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కెటిఆర్ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కెటిఆర్ సివిల్స్‌తో అసాధారణ ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు అమ్మాయిలకు ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంకర్లను కూడా మంత్రి కెటిఆర్ అభినందించారు. మీ ప్రతిభ, ప్రయత్నాలతో ఈ దేశాన్ని మీరు ముందు ఉండి నడుపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్ 2021లో టాప్ మూడు స్థానాలను అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. భూపాలపల్లికి చెందిన యువకుడు నరేశ్‌కు 117వ ర్యాంకు, నిజామాబాద్ యువతి స్నేహకు 136వ ర్యాంకు. సూర్యాపేటకు చెందిన చైతన్యరెడ్డికి 161వ ర్యాంకులు వచ్చాయి.

Minister KTR Appreciates Telugu CIivils Rankers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News