Saturday, November 23, 2024

మంత్రి కెటిఆర్ కొండంత భరోసా…

- Advertisement -
- Advertisement -

Minister KTR assured Free surgery for two-year-old Girl

హామీ నెరవేర్చిన సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజి ఇన్‌స్టిట్యూట్‌

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులు తమ గోడును రాష్ట్ర మంత్రి కెటి రామారావుకు విన్నవించుకున్నారు. పరిస్థితిని ఆకలింపు చేసుకున్న మంత్రి కెటిఆర్ ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న సదరు చిన్నారికి సహాయాన్నందిస్తామని హామీనిచ్చారు. చిన్నారికి చికిత్స నందించి తల్లిదండ్రులలో వెలుగు నింపారు. వివరాల్లోకి వెళితే.. మెడకు కుడివైపున ప్రాణాంతక నియోప్లాస్టిక్ వాపుతో బాధపడుతున్న బేబీ అక్షయ.. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుండి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యింది. ఆమె మెడకు కుడి వైపున 8.8 సెంమీ x 8.1 సెం.మీ. ఉన్న ఈ వాపు మెదడుకు రక్తం సరఫరా చేయడంలో ఆటంకం కలిగించి తద్వారా ప్రాణాంతక స్థితిగా మారింది.

డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని నేతృత్వంలోని రోబోటిక్ ఆంకో సర్జన్ల బృందం ఈ శస్త్ర చికిత్సను నిర్వహించింది. శస్త్ర చికిత్సలో సమస్యను గుర్తించడం, కోయడం, కరోటిడ్ ధమనిని, అలాగే వాయిస్ ఉత్పత్తి చేసే నరాల సంరక్షించడం జరిగింది. రక్తస్రావం సురక్షితంగా జరిగి, శస్త్రచికిత్స సంతృప్తికరంగా పూర్తి కావడానికి ముందే ఈ బృందం ఆహార పైపు మరియు శ్వాస పైపును వేరు చేసింది. ‘ఈ చిన్న పిల్ల ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ పరిస్థితితో బాధపడింది. ఈ వాపు ఆహారం, శ్వాస పైపుపై ఒత్తిడి కలిగించి ప్రాణాంతక స్థితిగా పరిణమించింది’ అని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లోని సర్జికల్ ఆంకాలజీ & రోబోటిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ చెప్పారు. తెలంగాణలో ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన ఈ చిన్నారి తల్లిదండ్రులు చికిత్స కోసం చాలా ప్రాంతాలకు తిరిగారు. సరైన పరిష్కారం దొరక్క, ఉన్న చికిత్స అయ్యే ఖర్చులను భరించలేక, ఆ పేద తల్లిదండ్రులు తమ కుటుంబానికి చెందిన వ్యక్తి ద్వారా మంత్రి కెటి రామారావుకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి అనారోగ్యంతో బాధపడుతున్న పాపకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News