Sunday, December 22, 2024

పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శనివారం ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. కెటిఆర్ తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను కలిసిన అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ… పొన్నాల లక్ష్మయ్యను బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చానని తెలిపారు. సిఎం కెసిఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని కెటిఆర్ వెల్లడించారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారు.

పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. రేపు పొన్నాల సిఎం కెసిఆర్ ను కలుస్తారన్నారు. సిఎంను కలిసి పొన్నాల తుదినిర్ణయం ప్రకటిస్తారు. కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య ఎంతో సేవ చేశారు. సీనియర్లకు కాంగ్రెస్ లో కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని కెటిఆర్ సూచించారు. పొన్నాలను రేవంత్ తూలనాడిన విధానం హీనసంస్కారానికి నిదర్శనం అన్నారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు దొంగను కూర్చోబెట్టారని కెటిఆర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News