Wednesday, January 22, 2025

జన్మదిన వేడుకలకు మంత్రి కెటిఆర్ దూరం

- Advertisement -
- Advertisement -

Minister KTR away from birthday celebrations

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు జన్మదిన సంబరాలకు బదులు తమకు తోచిన రీతిలో “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం ద్వారా ప్రజలకు సహాయం చేయాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ,పునరావాస కార్యక్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలని చెప్పారు. వరద సాయం ద్వారా బాధితులను ఆదుకోవాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News