Friday, November 22, 2024

హైదరాబాద్ ముంపు నివారణకు కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు తెస్తారా?

- Advertisement -
- Advertisement -

Minister KTR Challenge to Union Minister Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కెటిఆర్ సవాల్

రాజకీయంగానే కాదు.. అభివృద్ధిలోనూ పోటీ పడాలి ముంపు
నివారణకు రాష్ట్రం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతోంది కేంద్రం నుంచి
నిధులు తెస్తే కిషన్ రెడ్డికి ఘన సన్మానం చేస్తాం గడ్డి అన్నారంలో
త్వరలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి : భైరామల్‌గూడ ఫ్లై
ఓవర్, ఎల్‌బినగర్ అండర్‌పాస్‌లను ప్రారంభిస్తూ మంత్రి

మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరంలో నెలకొన్న వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000కోట్లు ఖర్చు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ. 10వేల కోట్ల్ల నిధులను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తేవాలని, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కో రారు. నిధులను తెస్తే ఆయనకు నగర నడిబొడ్డున పౌర సన్మానం ఘనంగా చేస్తామన్నారు. ఎన్నికలప్పుడే రాజ కీయాలని ఆ తరువాత కలిసికట్టుగా అందరం హైదరాబాద్ అభివృద్ధ్ది కృషి చేద్దామని, ఇందుకు టిఆర్‌ఎస్, బిజెపి పడదామంటూ కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా భైరామల్‌గూడ వద్ద నిర్మించిన ఫ్లైైఓవర్, ఎల్‌బినగర్ చౌరస్తా వద్ద అండర్ పాస్ మార్గాన్ని ప్రారంభించడంతో పాటు రూ.103 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 8 నాలాల అభివృద్ధి పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు బి.దయానంద్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతలతో కలిసి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ అకాల వర్షాలతో నగరం వరద ముంపునకు గురైతే కేంద్ర బృందం పర్యటించింది తప్పితే పైసా కూడా మంజూరు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని నలువైపులా ఒకే విధంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో రూ.672 కోట్ల వ్యయంతో ఫ్లై్లైఓవర్లు, అండర్ పాసులు, చేపట్టామని, అదేవిధంగా వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.103 కోట్లతో నాలాలను అభివృద్ధి చేయడంతో పాటు మరో రూ.33.34 కోట్ల వ్యయంతో స్లార్మ్ వాటర్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా మంచినీటి వసతి కోసం రూ.313 కోట్ల వ్యయంతో 47.5ఎంఎల్‌డి సామర్థం గల 12 రిజర్వాయర్లు, 352 కిలో మీటర్ల మేర పైపు లైన్ పనుల చేపట్టామని ఆయన తెలిపారు. వీటితో పాటు మురుగు నీటి శుద్ధికి, సీవరేజీ పనులకు రూ.43 కోట్లు, సమీకృత వైకుంఠధామాలకు రూ.4.58 కోట్లు, ఎనిమల్ కేర్ సెంటర్ రూ.4 కోట్లు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణం రూ.4 కోట్లు మొత్తం ఎల్‌బినగర్ నియోజకవర్గంలో రూ.2500 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను చేపట్టినట్లు మంత్రి వివరించారు.

గడ్డి అన్నారంలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ఎల్‌బినగర్ ప్రాంతంలోని గడ్డిఅన్నారంలో త్వరలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలోనే చేపట్టానున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు గాంధీ, ఉస్మానియాకు వెళ్లకుండా ఇక్కడే అత్యాధునిక వైద్యం చేయించుకోవచ్చాని తెలిపారు. మన బస్తీ మనబడి కార్యక్రమం ద్వారా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీస్ మీడియం అందుబాటులోకి రానుందన్నారు. తెలిసీ తెలియక ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన నిరుపేదల కోసం 58,59 జిఓల ద్వారా లక్ష మందికి పట్టాలను ఇచ్చి భూ హక్కును కల్పించామని, ఈ అవకాశాన్ని గతంలో వినియోగించుకోలేని వారి కోసం మరోసారి అవకాశం కల్పించామని తెలిపారు. ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల కారణంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి బిఎన్‌రెడ్డి, వసస్థలిపురం, నాగోల్ తదితర ప్రాంతాల్లో ఏర్పడిన సమస్యను త్వరలోనే పరిష్కారిస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్ పంకజ, ఎస్‌ఆర్‌డిపి సిఈ దేవానంద్, ఎస్‌సి రవీందర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News