Friday, January 3, 2025

కర్నాటకకు పోయి ఆరా తీద్దాం సిద్ధమా?: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బిజెపి హామీ ఏమైందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఐదు ట్రిలియన్లు ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న హామీ ఏమైందన్నారు. కర్నాటక మాడల్ గా కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కర్నాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. కర్నాటక రైతులు స్పాన్సర్డ్ ఇచ్చి తెచ్చారన్నారు. కర్నాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా అని కెటిఆర్ ప్రశ్నించారు.

నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేశామన్నారు. ఐటి, ఫార్మా,ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని కెటిఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజలు 55ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు. కేంద్రంలో బిజెపికి ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఏళ్లతరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News