Saturday, December 28, 2024

కెసిఆర్ సింహం లెక్క… సింగిల్ గానే వస్తారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని, కెసిఆర్ సింహం లాంటి వారు.. సింగిల్ గానే వస్తారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ తెలిపారు. తెలంగాణ సిఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలి.. మోడీ రాహుల్ కాదన్నారు. ఈ పోరాటం ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని ఆయన  తెలిపారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్తకాదు… గతంలో నెహ్రూ, ఇందిరతోనూ కొట్లాడారు.

అప్పుడు సోనియా గాంధీతో.. ఇప్పడు మోడీతో కొట్టాడుతున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో సిఎంలు దొరికారు… కానీ ఓటర్లు దొరకడం లేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. జానారెడ్డి పోటీ చేయరు .. కానీ సిఎం పదవి కావాలంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దు, సొంత నిర్ణయాలు తీసుకునే నాయకుడు కాంగ్రెస్, బిజెపిలో లేరని ఆయన వెల్లడించారు. జలవిహార్ లో న్యాయవాదుల ఆత్మయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News