హైదరాబాద్: బిజెపి నేత ఈటలది ఆత్మ గౌరవం కాదు.. ఆత్మవంచన మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల తనతో పాటు.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారని చెప్పారు. ఈటలకు టిఆర్ఎస్ ఎంత గౌరవమిచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని కెటిఆర్ సూచించారు. ఈటలకు టిఆర్ఎస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి కేబినేట్ నిర్ణయాలను తప్పుబట్టారని చెప్పారని గుర్తుచేశారు. ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈటలపై ప్రజల్లో సానుభూతి ఎందుకు ఉంటుంది. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని..? కెటిఆర్ ప్రశ్నించారు.
ప్రజలకు ఏం అన్యాయం చేశామని పాదయాత్ర చేస్తున్నారు..? అని అడిగాడు. ఈటలపై అనామకుడు లేఖ రాస్తే సిఎం చర్యలు తీసుకోలేదు. ఐదేళ్ల క్రితమే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎందుకు మంత్రిగా కొసాగారు..? ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా కెసిఆర్ మంత్రిగా ఉంచారు. ఈటలను టిఆర్ఎస్ లో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించానని కెటిఆర్ తెలిపారు. ఏ ఎన్నికైనా పార్టీల మధ్యే.. వ్యక్తుల మధ్య కాదని కెటిఆర్ చెప్పారు. హుజూరాబాద్ లో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చింది? అని ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. తెలంగాణకు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
Minister KTR Comments on Etela Rajender