హైదరాబాద్: ఐటిఐఆర్ రద్దుపై పార్లమెంట్ లో కేంద్ర ప్రకటన సిగ్గుచేటని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కుంచిత రాజకీయాల కోసమే ఐటిఐఆర్ రద్దు చేశారని మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఐటిఐఆర్ స్థాయిలో పథకం తేవాలని కేంద్రాన్ని 50 సార్లు కోరామన్నారు. ఐటిఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పారని తెలిపారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను కేంద్రం మోసగించిందని మంత్రి మండిపడ్డారు. బిజెపి డిఎన్ఏలోనే అసత్యలు, అవాస్తవాలు నిండి ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఐటికి కేంద్రం నయా పైసా సాయం చేయలేదని కెటిఆర్ తేల్చిచెప్పారు. ఐటిఐఆర్ రద్దుతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఐటిఐఆర్ ఉంటే ఆకాశమే హద్దుగా హైదరాబాద్ ఐటి ఎదిగేదని ఆయన తెలిపారు. 22 సాఫ్ట్ వేర్ పార్కుల్లో రాష్ట్రానికి ఒక్కటీ కేటాయించలేదని ఆరోపించారు.