పియూష్ గోయల్‌కు మంత్రి కెటిఆర్ చురక
హైదరాబాద్: చేనేత వస్త్ర పరిశ్రమపై 12 శాతం జిఎస్‌టి పెంచుతూ కేంద్రం తీసుకున్నప నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చేనేత సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నాలు చేసేందుకు సిద్ధమయ్యారు. చేనేతపై జిఎస్‌టి తగ్గించాలని బిజెపియేతర పార్టీలే కాకుండా ఆ పార్టీకి చంఎదినప వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొంటూ.. కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు చురకలంటించారు.
కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్, గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ .. ‘చేనేతపై జిఎస్టీనిప 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ఆ ఇద్దరు నేతలు డిమాండ్ చేశారు. మమ్మల్ని పట్టించుకోకపోయినా.. కనీసం గుజరాత్‌ను అయినా పట్టించుకోవాల’ని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు కెటిఆర్ సూచించారు. చేనేతపై జిఎస్‌టిని తగ్గించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. చేనేతపై జిఎస్‌టి తగ్గించేంత వరకూ పోరాటం చేస్తామని, జనవరి 5 నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం, చైర్మన్ యర్రమాద వెంకన్న బుధవారం ప్రకటించారు. జనవరి 5వ తేదీన తెలంగాణలో హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిఆపరు. ఈ మార్చ్‌కు టిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి పాల్గొంటుందని ఆ పార్టీ ఎంఎల్‌సి ఎల్ రమణ స్పష్టం చేశారు.