Monday, December 23, 2024

మోడీ దేశానికి ప్రధాని కాదా.. కర్నాటకకు మాత్రమే ప్రధానా?: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమేనని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి తెలిపారు. నీళ్లు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో అధిక వరి సాగు జరుగుతోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రైతన్నలకు సిఎం కెసిఆర్ రైతుబంధు, రైతు బీమా, విద్యుత్ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని కర్నాటక ప్రధాని మోడీ చెప్పారని ఆయన వెల్లడించారు. మోడీ దేశానికి ప్రధాని కాదా.. కర్నాటకకు మాత్రమే ప్రధానా? కెటిఆర్ ప్రశ్నించారు. అదానీ ఎయిర్ పోర్టు కొనుగోలుపై జీఎస్టీ ఎందుకు ఉండదు, పేదలు కొనేపాలు, పెరుగుపై జీఎస్టీ వేసిన ఘనుడు మోడీ అని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News