Sunday, December 22, 2024

ఢిల్లీ దొర మోడీతో కొట్లాడుతున్నాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్: ఢిల్లీ దొర మోడీతో కొట్లాడుతున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట, బిక్కనూర్ మండలాల బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించింది. కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. పేదలకు రూ. 2వేల పింఛన్ ఇవ్వాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నది కెసిఆర్ అన్నారు. రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ చేసిందా? అని ప్రశ్నించారు. రైతులను బిచ్చగాళ్లని అవమానించిన కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ సరఫరా చాలంటారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు వద్దనే వాళ్లు మనకు కావాలా?.. ఆలోచించాలని కెటిఆర్ కోరారు. మన తెలంగాణ మట్టిబిడ్డ కెసిఆర్ ఉండగా రాహుల్, ఢి.కె శివకుమార్ లు మనకెందుకన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీకైన కెసిఆర్ భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కెటిఆర్ ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News