Sunday, December 22, 2024

ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ గొప్పగా చెప్పారు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డెయిరీని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… పాడి రైతులకు లీటర్ కు రూ. 4 ప్రోత్సాహం ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పాడి రైతులకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహక నిధులు త్వరలోనే ఇస్తామని కెటిఆర్ వెల్లడించారు.

రూ. 21 వేల కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని ఆయన చెప్పారు. రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు వేశామని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ గొప్పగా చెప్పారు. మోడీ చర్యల వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా ? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం పెంచిన డీజిల్ ధరలతో సాగు ఖర్చు రెట్టింపు అయిందని ఆయన విమర్శించారు. సిఎం కెసిఆర్ చర్యల వల్ల వ్యవసాయం అంటే పండగా అయ్యింది.

వరి దిగుబడిలో పంజాబ్ ను తెలంగాణ అధిగమించిందన్నారు. రాష్ట్రంలో మహోన్నతమైన శ్వేతవిప్లవం రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పదేళ్లలో రాష్ట్రంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని సూచించారు. ఏదైనా రంగంలో నష్టం జరిగిందేమో ప్రజలు గమనించాలన్నారు. దేశంలో పెరగక పోయినా… తెలంగానలో రైతుల ఆదాయం పెరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News