Thursday, January 23, 2025

గాంధీభవన్ ను గాడ్సే చేతిలో పెట్టారు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Comments On Rahul Gandhi

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాక‌తీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్‌ వస్త్ర పరి‌శ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు… రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ హోదాలో వచ్చాడని ప్రశ్నించారు. మమ్మీ అధ్యక్షురాలైతే ఈయన డమ్మీ అన్నారు. మమ్మీ చేతితో రిమోట్, డమ్మీ చేతిలో పాలన అని ఎద్దేవా చేశారు. మన్మోహన్ సింగ్ ను ఆడించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం మీది కాదా. సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్ గౌరవించలేని వ్యక్తి రాహుల్ అన్నారు. ఏ పార్టీకి బిటీమ్, సి టీమ్ గా ఉండాల్సిన ఖర్మ టిఆర్ఎస్ కు పట్టలేదన్నారు. కాంగ్రెస్ పేరే స్కాంగ్రెస్ అన్నారు.

ప్రజలు 50 ఏళ్ల పాటు దేశాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టారు. కాంగ్రెస్ హయంలో అంతరిక్షం నుంచి పాతాళం దకా అన్నింటా అవినీతేనని మంత్రి విమర్శించారు. రాహుల్ పక్కన కూర్చోబెట్టుకున్నది ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని కెటిఆర్ తెలిపారు. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని అవినీతి గురించి మాట్లాడ్డమా అని ప్రశ్నించారు. కెసిఆర్ రాజు అయితే అవినీతి పిసిసి ఛీప్ బయట ఉంటాడా..? గాంధీభవన్ ను గాడ్సే చేలితో పెట్టారు. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ పార్టీ అన్ని కెటిఆర్ అమేథీలో గెలిచే సత్తా లేక కేరళకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ క్రైసిస్ కమిటీ అని ఆయన పేర్కొన్నారు. జాతీయపార్టీకి రాష్ట్రానికో డిక్లరేషన్ ఉంటుందా… జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండదా? రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలు పాతరేసే పరిస్థితి తీసుకొచ్చాకే తెలంగాణ ఇచ్చారు. వడ్ల విషయంలో రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతుంటే రాహుల్ ఎందుకు మాట్టాడలేదని మంత్రి కెటిఆర్  ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News