Thursday, January 23, 2025

కెసిఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విశాఖ ఉక్కుపైన గట్టిగా మాట్లాడింది మన సిఎం కెసిఆరేనని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మేము తెగించి కొట్లడాం కాబట్టే కేంద్రం ఇప్పడు ప్రకటన చేసిందని మంత్రి తెలిపారు. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. కెసిఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న సంచలనాత్మకమైన నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సిఎం కెసిఆర్ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పెద్దలను షాక్ కు గురిచేసిందని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి డైరెక్టర్ల బృందం మంగళవారం నాడు పర్యటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News