Saturday, November 9, 2024

నెటిజన్లతో ‘ఆస్క్ కెటిఆర్’ కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

Minister KTR Conducts Ask ktr program

హైదరాబాద్: ట్విటర్ వేదికగా నెటిజన్లతో మంత్రి కెటిఆర్ ‘ఆస్క్ కెటిఆర్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించామని కెటిఆర్ తెలిపారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లో కొత్తగా మూడు టిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని అఫ్ గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. 33 జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నామని పేర్కొన్నారు. కర్నాటకలో సిఎం పదవి అమ్మకం వార్తలు బిజెపి నిజస్వరూపం బయటపడిందన్నారు. హైదరాబాద్ లో క్రెకెట్ మ్యాచులు నిర్వహించకపోవడంపై కెటిఆర్ కు నెటిజన్ ప్రశ్న వేశాడు. మ్యాచులు ఎందుకు నిర్వహించట్లేదో గంగూలీ,జైషాను అడగాలని కెటిఆర్ బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజా ఆశీర్వాదంతో ప్రగతిని కొనసాగిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపితో పాటు ఇతర పార్టీలు మాకు పోటీనే అన్నారు. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని కెటిఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఐటిఆర్ఆర్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని నెటిజన్ తెలిపాడు.

ఎన్ పిఏ ప్రభుత్వం తెలంగాణ ఏమి ఇవ్వలేదని ఆయన తెలిపారు. కేంద్రంపై రాష్ట్రాలు కలికట్టుగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ తెలంగాణ వెలుపలకు కూడా విస్తరించాలని ఓ నెటిజన్ తెలిపాడు. భవిష్యత్ లో ఏం జరగాల్సి ఉందో ఎవరికి తెలుసన్న కెటిఆర్. ఆదిలాబాద్ లో బిడిఎన్ టి ల్యాబ్ ను జులైలో ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత వచ్చి పట్టుదలగా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనికి 244 జీఓకు అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం ఇవ్వాలన్న నెటిజన్. తెలంగాణకు కేంద్రం ఏ ఒక్క ప్రముఖ విద్యాసంస్థ ఇవ్వలేదని విమర్శించారు. ఐఐఎం, ఐఐఐటి, ఐఐఎష్ఈఆర్, ఎన్ఐడి సంస్థల్లో ఒక్కటీ ఇవ్వలేదని చెప్పారు. 8 ఏళ్లుగా అడుగుతున్నాం… ఇక కేంద్రం ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. బిఆర్ఎస్ అంశం హైకోర్టు వద్ద పెండింగ్ లో ఉంది. బిఆర్ఎస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైతు అనుకూల విధానాలతో ఏడేళ్లలో సాగు 120 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోడ్లపైనే హత్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న నెటిజన్ తెలిపాడు. నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే మాధ్యమాలపై చర్యలుంటాయి. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుతో మోడీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News