Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పిఎల్. శ్రీనివాస్‌ను అభినందించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పిఎల్ శ్రీనివాస్‌ను మంత్రి కెటిఆర్ అభినందించారు. సోమవారం బేగంపేటలోని ఐటిసి కాకతీయలో జరిగిన కార్యక్రమంలో పిఎల్ శ్రీనివాస్ మంత్రి కెటిఆర్‌ను కలిసి ప్రభుత్వ పథకాలపై తాను చేస్తున్న ప్రచార కార్యక్రమాల గురించి వివరించారు. దాంతో మంత్రి కెటిఆర్ అభినందించారు.

అనంతరం బిఆర్‌ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సృజనాత్మక పథకాలను ఇతర రాష్ట్రాలు, దేశం అనుసరిస్తుండటం మనందరికీ గర్వకారణమని, వాటిని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. వరి సాగులోనూ తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, బిసిల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News