- Advertisement -
హైదరాబాద్ : సింగపూర్ ఓపెన్‌లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పివి సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్ జీ యీపై 219, 1121, 2115 తేడాతో నెగ్గింది. దీంతో తన కెరీర్‌లో తొలిసారి సింగపూర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి కెటిఆర్ కూడా సింధును అభినందించారు. ‘మెనీ కంగ్రాచ్యులేషన్స్ సింధు’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -