Monday, December 23, 2024

లోకేష్ కుమార్‌కు మంత్రి కెటిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుదీర్ఘ కాలం పాటు జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా సేవలను అందించిన లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో బల్దియా అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. జిహెచ్‌ఎంసి నుంచి రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా బదిలీపై వెళ్లిన లోకేష్ కుమార్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ… లోకేస్ కుమార్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పన, ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఎస్‌ఆర్‌డిపి, లింక్ రోడ్ల నిర్మాణం, ఎస్‌ఎన్‌డి పి వంటి వ్యూహాత్మక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన విశేష కృషి చేశారంటూ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ ను మంత్రి కెటిఆర్ శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.

అదేవిధంగా జిహెచ్‌ఎంసి నూతన కమిషనర్ రోనాల్డ్‌రోస్‌కు మంత్రి అభినందనలు తెలిపారు.ఈకార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్, నూతన జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్, మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి, జిహెచ్‌ఎంసి జోనల్, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News