Monday, December 23, 2024

ఉత్తర యుద్ధం అద్భుతం.. రాష్ట్రమంతా కొనసాగిద్దాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నర్సంపేట: ఉత్తర యుద్ధం అద్భుతమైన కార్యక్రమం.. ఇది రాష్ట్రమంతా కొనసాగిద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టెలీ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని అభినందించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటీవల ప్రారంభించిన ఉత్తర యుద్ధం కార్యక్రమం రోజు రోజుకు ప్రశంసలందుకుంటుంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు తమ మద్దతును తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది.

తాజాగా ఈ కార్యక్రమం పట్ల నేడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని అభినందించారు. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని కితాబిచ్చారు. ఈ ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 119 నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో తీర్మాణాలు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈ ఉత్తర ఉద్యమం కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని కేటీఆర్ కోరినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News