Monday, December 23, 2024

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కెటిఆర్ కౌంటర్..

- Advertisement -
- Advertisement -

Minister KTR counters Amit Shah's remarks

మీ ఆధిపత్యం బూమ్‌రాంగ్ అవుతుందని హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్ ః ఇప్పటికే రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హిందీ భాషనే మాట్లాడాలి అంటూ చేసిన వ్యాఖ్యలు మరోమారు బిజెపిని టార్గెట్ చేయడానికి టిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఆయుధంగా మారాయి. కేంద్రం విధానాలపై తాజాగా మరోసారి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. శుక్రవారం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేప్పుడు ఇంగ్లిష్, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని అమిత్ షా అన్నారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ‘దేశ భిన్నత్వంపై దాడి’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.. భారతదేశం ఓ వసుదైక కుటుంబమని, భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని కెటిఆర్ అన్నారు. అలాంటిది దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని అని సూచించారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదంటూ ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్ అవుతాయన్నారు. ‘నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని.. నా మాతృభాష తెలుగు. అయినా ఇంగ్లిష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లిష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి’ అని కెటిఆర్ అన్నారు. హిందీ భాష విషయంలో అమిత్‌షా వ్యాఖ్యలపై కేంద్రం తీరుపై కెటిఆర్ తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.

హిందీనే మాట్లాడాలన్న అమిత్ షా .. మండిపడుతున్న ప్రతిపక్షాలు

ఇప్పటికే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారతదేశ భిన్నత్వంపై దాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. అంతేకాదు హిందీ సామ్రాజ్య వాదం దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దటం కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్శలు వెల్లువగా మారాయి. హిందీ భాష అధికార భాష కానీ జాతీయ భాష కాదు అని హిందీని జాతీయ భాషగా చేసే ప్రయత్నాలకు బదులు పెట్రోల్, డీజిల్ ఇతర ధరలు తగ్గించడంపై కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News