Sunday, January 19, 2025

మోడీజీ.. ఇప్పటికైనా మెచ్చుకునేందుకు నోరు మెదపరా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ఐటి పరిశ్రమ శాఖల మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో కేవలం తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ది కనిపిండటం లేదా అని ప్రశ్నించారు. ఇంత తక్కు వ వ్యవధిలో ఇంతటి గొప్ప అభివృద్ధిని దే శంలోని మరే రాష్ట్రంలోనైనా చూపగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పది అద్బుతాలుగా ఇవి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. అభివృద్ది చేసి చూపినందుకు అభినందించాల్సిందిపోయి విమర్శలు చేస్తారా అని నిలదీశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప థకం, అంబేద్కర్ విగ్రహం , వైట్ హౌస్‌ను తలదన్నే రీతిలో నిర్మించిన డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, తెలంగాణ అమరవీరుల స్తూపం, టిహబ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, మిషన్ భగీరథ, భారతదేశ జిడిపిలో నాలుగు అత్యుత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.

దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్క్, ప్రపంచ వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్, తలసరి ఆదాయంలో మొదటిస్థానం. సిఎస్‌డిఎస్ సర్వే ప్రకారం అత్యంత తక్కువగల అవినీతి రాష్ట్రంగా తెలంగాణ. ఐటి ఉద్యోగాల సృష్టిలో అత్యుత్తమ స్థానం. వీటన్నింటినీ తెలంగాణ పునర్ నిర్మాణానికి ప్రతీకలుగా కెటిఆర్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ దూరదృష్టి, దార్శనికత, ప్రజారక్షణ, శ్రేయస్సులకు ఇవి దర్పణాలుగా విరాజిల్లుతున్నాయన్నారు. మరే రాష్ట్రంలలో చేపట్టని విధంగా ఈ అద్భుతాలు రాష్ట్ర ప్రజలకు ఉపయుక్తంలోకి వచ్చాయన్నారు. ఎవరేమనుకున్నా ప్రజలకు మెరుగైన మౌలిక, సౌకర్యాలను అందించడంలో సిఎం కెసిఆర్ చిత్తశుద్ధ్దికి ఇవి ప్రత్యక్ష నిదర్శనాలుగా పేర్కొనవచ్చని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రధానికి ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన ఇమేజ్‌లను కూడా పొందుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News