Saturday, November 2, 2024

సాగు చట్టాలపై మోడీ క్షమాపణలు కేవలం ఎన్నికల స్టంటేనా?

- Advertisement -
- Advertisement -

Minister KTR criticizes Union minister Tomar

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కెటిఆర్ ఎద్దేవా

హైదరాబాద్: సాగు చట్టాలపై మోడీ క్షమాపణలు కేవలం ఎన్నికల స్టంటేనా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. రద్దు చేసిన చట్టాలను మళ్లీ తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి విమర్శలు గుప్పించారు. ప్రధాని రద్దు చేస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మళ్లీ తెస్తామనటం చాలా అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి పట్ల దేశ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం ఎన్నికల కోసం బిజెపి ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరతీసిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలతో బిజెపి పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. రైతుల ఉద్యమంతో ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశంపై ప్రధాని మోడీ రైతులకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం రైతులు ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. కేంద్రం హామీలతో రైతులు ఉద్యమాన్ని విరమించుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో మళ్లీ సాగు చట్టాలపై చర్చ మొదలైనట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News