Wednesday, January 22, 2025

పెట్టుబడుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడు లే లక్షంగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సాగిన ఈ పర్యటనలో రూ. 21వేల కోట్ల పెట్టుబడులను సా ధించారు. ఈ పర్యటనలో మంత్రి కెటిఆర్ మొత్తం 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చ ల్లో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రాని కి రానున్న పెట్టుబడుల్లో సింహభాగం సాఫ్ట్‌వేర్‌లో ప్రపంచ మైక్రోసాఫ్ట్ సంస్థ పెడుతోంది. ఈ సంస్థ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పా టు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా గే గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కం పెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ లో తమ

సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రూ.2వేల కోట్లతో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటాసెంటర్‌ను హైదరాబాద్‌లో భారతీ ఏయిర్ టెల్ గ్రూప్‌పెడుతున్నట్లు వెల్లడించింది. యూరోఫిన్ సైంటిఫిక్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. కాగా రూ. 750 కోట్ల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రంను ఏర్పాటు చేస్తోంది. అలాగే వెబ్‌పిటి సంస్థ రూ. 150 కోట్లతో ఔట్ పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు దావోస్ వేదికగా వెల్లడించింది. వీటితో పాటు హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్ లో విస్తరిస్తామని ఫ్రాన్స్ కు చెందిన ప్రఖ్యాత ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ ప్రకటన చేసింది.

లండన్ తరువాత హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న అపోలో టైర్స్, తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు పెప్సికో, నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాదులో ప్రారంభించనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ అనతికాలంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్ర ప్రగతి ప్రపంచ వేదికలపై పరిచయం చేసే ప్రయత్నం ఈసారి కూడా సూపర్ హిట్ అయింది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పెట్టుబడి, విస్తరణ ప్రణాళికల లిస్ట్ లో తెలంగాణ పేరే ముందు వరుసలో ఉండాలనుకున్న ఆరాటం విజయవంతమైంది.

ప్రధానంగా రాష్ట్ర యవతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండాలన్న సంకల్పం ఎప్పటిలాగే సాకారమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శనం, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు నాయకత్వ ప్రతిభ, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిరంతర సమన్వయం, అలుపెరగని కృషితో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సమావేశాల్లో తెలంగాణ పేరు మరోసారి మార్మోగింది.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ఈసారి కూడా దావోస్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల వ్యాపార వాణిజ్య సంస్థలు నాయకత్వం, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగం పంచుకునే మేధావులు, ఆర్థిక నిపుణులు ఎంతో మంది తెలంగాణ పెవిలియన్ ను సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపంతో పాటు ఎనిమిది సంవత్సరాల్లో వివిధ రంగాల్లో సాధించిన పెట్టుబడులు, పారిశ్రామిక, ఐటి దాని అనుబంధ రంగాల్లో చేపట్టిన టి…హబ్, టి..వర్క్ కార్యక్రమాల సమాచారాన్ని ఆసక్తిగా తెలుసుకున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం భారీ ప్రాజెక్టు, ఇతర మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ విధానాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను చూశారు.

దావోస్‌లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే పెట్టబడుల వేట మొదలుపెట్టిన తెలంగాణ బృందం అనుకున్న లక్ష్యాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే అందుకుంది. ఐదోసారి వరల్డ్ ఎకానమీ ఫోరం సమావేశాలకు హాజరైన మంత్రి కెటిఆర్ ఎప్పటిలాగే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతం అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అగ్రనాయకత్వంతో ఒక వైపు ముఖాముఖి చర్చలు నిర్వహిస్తూనే, మరోవైపు ప్రఖ్యాత ఆర్థిక సంస్థల సమావేశాలకు హాజరై తెలంగాణ విజయగాథను వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News